Last Updated:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించిన సీఎం జగన్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ పర్యాటకుల భద్రతకోసం వీటిని ఏర్పాటు చేసామని స్దానిక పోలీస్ స్టేషన్లకు ఇవి అనుసంధానంగా పనిచేస్తాయని తెలిపారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడాయని అన్నారు.

పోలీసు శాఖలో సంస్కరణలు..(Andhra Pradesh)

గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసు శాఖలో పలు సంస్కరణలను తీసుకువచ్చామని సీఎం జగన్ తెలిపారు. పోలీసులు ప్రజలకు స్నేహితులు అన్న భావన కలిగే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలుచేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులను పెట్టి ప్రజలకు తోడుగా నిలిచే కార్యకర్మం చేపట్టామన్నారు. టూరిస్ట్ పోలీస్ స్టేషన్లతో ఇతర ప్రాంతాలనుంచి పర్యాటక ప్రదేశాలకు వచ్చినవారికి ఎటువంటి ఇబ్బంది, భయం లేకుంగా పోలీసులు చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ చెప్పారు.

నిందితుడి కారులో డీఎస్పీ షికారు..(Andhra Pradesh)

ఏపీలోని అనకాపల్లి డీఎస్పీ బి. సునీల్ కుమార్ గంజాయి కేసులో పట్టుబడిన ఓ నిందితుడికి చెందిన వాహనాన్ని సొంతానికి వాడుకుంటూ దొరికిపోయారు. కారు నెంబర్ ప్లేట్ ను కూడా మార్చి కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు విశాఖ బీచ్‌కు వెళ్లారని స్పష్టమయింది. విశాఖ బీచ్‌లో మరో వాహనాన్ని డీఎస్పీ తీసుకెళ్లిన కారు ఢీ కొట్టడంటో ఈ వ్యవహారం బయటపడింది. సీజ్ చేసిన వాహనాన్ని సొంతానికి వాడుకోవటమే కాకుండాదానికున్న నెంబర్ ప్లేట్ మార్చటంపై డీఎస్పీ చిక్కుల్లో పడ్డారు.

నెంబర్ ప్లేటు మార్చేసిన ఖాకీలు..

అనకాపల్లి జిల్లాలో గతేడాది కొందరు దుండగులు కారులో గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. కశింకోట వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులను చూసి నిందితులు తాము వచ్చిన స్పార్కియోను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. పోలీసులు ఆ కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. జి.మాడుగులకు చెందిన సుల్తాన్‌ అజారుద్దీన్‌ పేరుతో సీజ్ చేసిన ఈ స్కార్పియో రిజిస్టరై ఉంది. మరోవైపు గత ఏడాది నవంబర్ నెలలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కశింకోట గంజాయి కేసుకు సంబంధించిన నిందితుడు ఎర్రరంగు మారుతి స్విఫ్ట్ కారులో వస్తూ పట్టుబడ్డాడు. ఈ కారుకు నెంబర్ ప్లేట్ లేదు. దీనితో ఆ కారును అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. గతంలో సీజ్ చేసిన స్కార్పియో కారు నెంబర్ ప్లేట్క్ష్ ను ఈ స్విఫ్ట్ కు తగిలించి పోలీసులు తిరగడం ప్రారంభించారు.

ఈ నేపధ్యంలో ఫిభ్రవరి 1న అనకాపల్లి డీఎస్పీ సునీల్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారు తీసుకుని విశాఖపట్నం బీచ్ కు వెళ్లారు. బీచ్‌ రోడ్డులో డీఎస్పీ తీసుకెళ్లిన కారు మరో వాహనాన్ని ఢీకొట్టగా.. అక్కడున్న వారు దాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఇది చివరకు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్ అయ్యారు. దీనిపై పై అధికారులకు నివేదికను పంపుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: