Motorola Moto G72: మోటో సంస్థ వారు విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే!
మోటోరోలా స్మార్ట్ ఫోన్ మన ముందు రాబోతుంది. జీ సిరీస్‌లో మరో ఆకర్షణీయమైన ఫోన్‌ను మన ముందు విడుదల చేయనున్నారు. మోటో జీ72 మొబైల్‌ను వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు.
Motorola Moto G72: మోటోరోలా స్మార్ట్ ఫోన్ మన ముందు రాబోతుంది. జీ సిరీస్‌లో మరో ఆకర్షణీయమైన ఫోన్‌ను మన ముందు విడుదల చేయనున్నారు. మోటో జీ72 మొబైల్‌ను వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు. ఈ విషయం మోటోరోలా అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ స్మార్ట్ ఫోనులో display,కెమెరా హైలైట్‌గా నిలవనున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ 10-bit OLED డిస్ప్లేతో ఈ ఫోన్ మన ముందుకు రానుంది. 4జీ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. మోటో జీ72 లాంచ్, స్పెసిఫికేషన్లు, ధరలు ఈ విధంగా ఉన్నాయి.
మోటో జీ72 స్పెసిఫికేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
120Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ HD+ pOLED Display మోటో జీ72ని తీసుకురానున్నట్టు మోటోరోలా వెల్లడించింది. 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్,10-బిట్ కలర్, HDR10 సపోర్ట్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ in display ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను మోటో ఇస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్‌ఫోన్ పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్ట్ మైయూఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.
మోటో జీ72 ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
మోటో జీ72 స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,000 నుంచి రూ.17,000 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిసిన సమాచారం. ఈ ఫోనుకు 5జీ సపోర్ట్ లేకపోయినా, ఫోన్ రఫ్ అండ్ టఫ్ వాడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది. మెటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్ ఆప్షన్లలో మోటో జీ72 ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి సేల్కు వస్తుంది.