Published On:

AP HORTICET 2025: ఏపీ హార్టిసెట్‌-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

AP HORTICET 2025: ఏపీ హార్టిసెట్‌-2025 నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

AP HORTICET 2025 Dr.YSRHU Diploma Courses: ఏపీ హార్టిసెట్‌-2025 నోటిఫికేష‌న్‌ విడుద‌లలైంది. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2025- 26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ హార్టిసెట్‌-2025 నోటిఫికేష‌న్‌ విడుదల చేసింది. రెండేళ్ల హార్టికల్చర్ డిప్లొమా కోర్సులలో డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ (ల్యాండ్ స్కేపింగ్ & నర్సరీ మేనేజ్మెంట్) కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.

 

డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్ వర్సిటీతోపాటు దాని అనుబంధ హార్టికల్చర్ కళాశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 528 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. పదోతరగతిలో వచ్చిన మార్కుల పర్సంటేజీ ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఆఫ్ లైన్‌లో సమర్పించాలని పేర్కొంది. పూర్తి వివరాలకు https://drysrhu.ap.gov.in/ పరిశీలించాలని అధికారులు పేర్కొన్నారు.