Tehsildar Venkatesh : ఏసీబీ వలలో దామరగిద్ద తహశీల్దారు వెంకటేష్
5వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దామరగద్ద తహశీల్దారు వెంకటేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు
Narayanapet: 5వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దామరగద్ద తహశీల్దారు వెంకటేష్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. మండల పరిధిలోని అన్నాసాగర్ కు చెందిన ఓ వ్యక్తి నాన్ అగ్రికల్చర్ రిజిష్ట్రేషన్ చేసుకొన్నాడు. ఆ రిజిస్ట్రేషన్ పై తహశీల్దారు సంతకం కొరకు తహశీల్దారు వెంకటేష్ ను బాధితుడు సంప్రదించాడు. స్టాంపు వేసేందుకు 10వేల లంచం ఇచ్చేలా బాధిత వ్యక్తితో తహశీల్దారు బేరం కుదుర్చుకొన్నాడు.
బాధితుడు ఏసీబీని ఆశ్రయించి పధకం ప్రకారం తహశీల్దారు వెంకటేష్ కు లంచం సొమ్ములో సగం 5వేల ఇస్తుండగా అధికారులు వలపన్ని పట్టుకొన్నారు. అనంతరం తహశీల్దారు కార్యాలయంతోపాటు ఆయన నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసారు. దాడుల వార్తతో పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బంది నిశ్శబ్ధంగా ఉండిపోయారు.
ఇది కూడా చదవండి : Viveka Murder Case: శివశంకర రెడ్డికి సుప్రీంలో బెయిల్ నిరాకరణ