Realme P3 Ultra: డబ్బులంటే ప్రేమా.. రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్.. ఆఫర్స్ అరాచకం..!

Realme P3 Ultra: రియల్‌మీ భారతదేశంలో తన మొదటి అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ ఈ సిరీస్ స్టాండర్ట్ మోడల్ అయిన ‘Realme P3 5G’ ని కూడా భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ ఇటీవల ధృవీకరించింది. ‘Realme P3 Ultra’ మోడల్ ధర ఈరోజు వెల్లడైంది. రియల్‌మీ ఈ రెండు ఫోన్‌లు శక్తివంతమైన బ్యాటరీ, గొప్ప ఫీచర్లతో వస్తాయి.
Realme P3 Ultra Price
రియల్‌మీ P3 అల్ట్రా భారతదేశంలో రూ. 26,999 ప్రారంభ ధరతో విడుదల చేశారు. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB, 12GB RAM + 256GB. రియల్‌మీ ఈ ఫోన్ ఇతర రెండు వేరియంట్‌ల ధర వరుసగా రూ. 27,999, రూ. 29,999. ఈ ఫోన్ నెప్ట్యూన్ బ్లూ, ఓరియన్ రెడ్ అనే రెండు రంగు ఎంపికలలో వస్తుంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ ఫోన్ వెనుక భాగంలో ఇచ్చారు. సామ్‌సంగ్, షియోమీ,వంటి బ్రాండ్‌ల అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే రియల్‌మీ ఈ అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధరలో సగం కంటే తక్కువ ధరకే వస్తుంది.
ఈ మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విక్రయం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌లలో మార్చి 25 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దీని ప్రీ బుకింగ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైంది. మొదటి సేల్‌లో ఫోన్ కొనుగోలుపై రూ. 3,000 వరకు బ్యాంక్ తగ్గింపు, రూ. 1,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
Realme P3 5G Price
కంపెనీ Realme P3 5Gని రూ. 16,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 6GB RAM + 128GB, 8GB RAM + 128GB, 8GB RAM + 256GB. దాని ఇతర రెండు వేరియంట్‌ల ధర వరుసగా రూ. 17,999 , రూ. 19,999. ఈ ఫోన్ మొదటి ఎర్లీ బర్డ్ సేల్ ఈరోజు మార్చి 19న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య జరుగుతుంది. దీని మొదటి సేల్ మార్చి 26 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా రియల్‌మీ ఈ ఫోన్ రూ. 14,999కి అందుబాటులో ఉంటుంది.