Shivaji Ganesan: నటుడు శివాజీ గణేశన్ ఇల్లు జప్తు – హైకోర్టు ఆదేశం

Sivaji Ganesan House Seized: నడిగర్ తిలగం, మహానటుడు శివాజీ గణేశన్ ఇంటినిక జప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన మనవడు దుష్యంత్ (శివాజీ గణేశన్ పెద్ద కుమారుడు రామ్ కుమార్ కొడుకు) చేసిన అప్పును తీర్చలేకపోవడంతో ఆయన ఇంటిని జప్తు చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మహానటుడు శివాజీ గణేశన్ ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని జప్తు చేస్తుండటంతో ఆయన అభిమానులు వాపోతున్నారు.
కాగా ఆయన మనవడు దుష్యంత్ తన భార్య అభిరామితో పాటు ఇతర కుటుంబసభ్యులు కలిసి ‘ఈశాన్ ప్రొడక్షన్స్’ పేరుతో సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. అయితే ఈ సంస్థలో వచ్చిన సినిమాలేవి పెద్దగా హిట్ కాలేదు. ప్రస్తుతం అతటి అప్పుల్లో, నష్టాల్లో ఉంది. దీంతో ఒక సినిమా తీసి హిట్ కొట్టి అప్పులన్ని తీర్చుకోవాలని తీర్చుకోవాలనే ఆశతో దుష్యంత్ ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ నుంచి అప్పు తీసుకున్నాడు.
‘జగజాల కిల్లాడి’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందుకోసం ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ సంస్థ నుంచి రూ. 3.74 కోట్లను 30 శాతం వడ్డీతో అప్పుగా తీసుకున్నాడు. అయితే ఈ సినిమా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చెప్పిన గడువు లోపు అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో ధనభాగ్యం ఎంటర్ప్రైజెస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యవర్తిగా రిటైర్డ్ న్యాయమూర్తి రవీంద్రన్‌ను హైకోర్టు నియమించింది. దీంతో సినిమా పూర్తయ్యిందని, రిలీజైన వెంటనే అప్పు తీర్చేస్తానంటూ దుష్యంత్ అబద్ధాలు ఆడాడు.
దీంతో సినిమాను ధనభాగ్య సంస్థకు ఇచ్చేయాలని, అప్పు తీరగా వచ్చిన సొమ్మును తీసుకోవాలని మధ్యవర్తి చెప్పడంతో అసలు విషయం బయట పడింది. అప్పుడు సినిమా ఇంకా పూర్తి కాలేదని దుష్యంత్ ఒప్పుకున్నాడు. దీంతో దుష్యంత్ కోర్టును తప్పుదొవ పట్టించే ప్రయత్నం చేయడమే కాకుండా, డబ్బులు ఇవ్వకుండ తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు మధ్యవర్తిగా రిటైర్డ్ న్యాయమూర్తి రవీంద్రన్ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఆయన నివేదికు ఏకభవించిన న్యాయస్థానం దుష్యంత్ తీరుపై మండిపడింది. దీంతో దుష్యంత్‌కు ఉమ్మడిగా ఆస్తిగా దక్కిన తాత(శివాజీ గణేశన్) ఇంటిని జప్తు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు శివాజీ గణేశన్ ఇంటికి తాళాలు వేసి సీజ్ చేశారు. దీనిపై ఆయన ఎంతో ఇష్టంగా, అభిరుచికి తగ్గట్టు నిర్మించిన ఈ ఇంటిని కోర్టు సీజ్ చేయడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.