Case Filed on KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్!
Hyderabad Formula E Race Case Filed on KTR: తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం నెలకొంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లీకులు ఇచ్చారు. రాష్ట్రంలో పెద్ద బాంబు పేలనుందని వెల్లడించారు. ఈ లీకులు కేటీఆర్ విషయమేనని పలువురు అనుకుంటున్నారు. అయితే కేటీఆర్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ కేటీఆర్‌పై కేసు నమోదు చేసింది. కేటీఆర్‌పై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ నాలుగు కేసులు కూడా నాన్ బెయిలబుల్ కేసులుగా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసింగ్ కారు రేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.