Pashamylaram: పాశమైలారం ఘటనపై కేటీఆర్ సీరియస్

ktr serious on pashamylaram: పాశమైలారం ఘటనపై మాజీమంత్రి కేటీఆర్ స్పందించారు. 12 మందికి పైగా కార్మికులు చనిపోయి, ఎంతో మంది కార్మికులు ఇంకా శిథిలాల కిందనే ఉంటే ఒక్క తెలంగాణ మంత్రి కూడా సంఘటన స్థలానికి పోకపోవడం దురదృష్టకరమని కేటీఆర్ విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులతో కూడిన BRS బృందం ప్రమాదస్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేశారని తెలిపారు.
చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఓదార్చడంతో పాటు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నామని కేటీర్ అన్నారు. ఒకవేళ ఇవే మిస్ వరల్డ్ పోటీలు అయితే CM రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ మంత్రులంతా అక్కడే క్యాంప్ లు ఏర్పాటుచేసుకుని ఫుల్ మస్తీ చేసేవారని కేటీఆర్ మండిపడ్డారు. పేదలు, కార్మికుల ప్రాణాలు, జీవితాలంటే కాంగ్రెస్ మంత్రులు, నేతలకు లెక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.