Published On:

Legal Notice to Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

Legal Notice to Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ నోటీసులు.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..!

KTR sent Legal Notice to TPCC Chief Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై అనవసర ఆరోపణలు చేయడంతో మహేశ్ కుమార్ కు ఈ నోటీసులు పంపినట్టుగా తెలిపారు. హామీలు అమలు చేయడం చేతకాని కాంగ్రెస్ సర్కార్, తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై, తమ పార్టీపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాగోలేదని మండిపడ్డారు. వెంటనే బేషరతుగా మహేశ్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

 

కాగా టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లు ట్యాప్ చేశారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం దారుణమైన చర్య, ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని అని విమర్శలు చేశారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే ఉండాలనే దురుద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణమని ఆరోపించారు.