Home / Uncategorized
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సవరించింది ఎన్నికల కమిషన్. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న జరగాల్సిన ఎన్నికలు తేదీని సవరించినట్టు భారత ఎన్నికల కమిషన్ బుధవారంనాడు ప్రకటించింది. నవంబర్ 25న ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ వర్గాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ ను సవరణ చేసినట్టు పేర్కొంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సతీమణి తమ్ముడు నార్నే నితిన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ లతో కలిసి నటిస్తున్న చిత్రం "మ్యాడ్". కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో నవదీప్ ఉన్నారని అన్నారు. నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను అదుపులోకి తీసుకున్నామని అతని ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసామని చెప్పారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన భార్య అక్షతా మూర్తి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. G20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన సునక్, శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనను తాను హిందువుగా గర్వపడతానని చెప్పారు. దేశ రాజధానిలో ఉన్న సమయంలో ఒక ఆలయాన్ని సందర్శించాలనే తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ, తీరుతెన్నులను తెలిపే బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. గతంలో ప్రధాన ఎన్నికల కమీషనర్ మరియు ఎన్నికల సంఘాన్ని ఎంపిక చేసే ప్యానెల్లో గతంలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుతం దీని నుండి దూరంగా ఉంచబడ్డారు
తనకు ప్రదానం చేసిన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు పురస్కారం మొత్తాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం పూణేలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. నేను బహుమతి డబ్బును నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ అవార్డును దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు అంకితం చేయాలనుకుంటున్నానని మోదీ అన్నారు.
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కురిసిన భారీ వానలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్, 20 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ
ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ యునైటెడ్ విపక్ష ఫ్రంట్‌ని ఇకపై ఇలా పిలుస్తారు, బెంగళూరులో జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న 26 పార్టీలు ఈ రోజు నిర్ణయం తీసుకున్నాయి, కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ 2024 సాధారణ ఎన్నికలను మోదీ వర్సెస్ ఇండియా యుద్ధంగా పిలిచారు.
ఈ సంవత్సరం కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర చేసిన యాత్రికుల సంఖ్య గత 16 రోజుల్లో 2,29,221కి చేరింది,.ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఆదివారం 20,806 మంది యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు.
ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రసారాలు నిలిచిపోవడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దీనిపై తాను మాట్లాడతానని అన్నారు. ఆదివారం ఏలూరు లో ప్రైమ్ 9 న్యూస్ ప్రతినిధిని పలకరించిన పవన్ కళ్యాణ్ ప్రసారాలు నిలిచిపోవడంపై ఆరా తీసారు.