ఫిఫా వరల్డ్ కప్ : పెళ్లి కొడుకు అర్జెంటీనా, పెళ్లి కూతురు ఫ్రాన్స్… కానీ పెళ్లి మాత్రం ఇండియాలో !
మన దేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్ ని సపోర్ట్ చేసినంతగా మరే క్రీడని అభిమానించరు అంటే అతిశయోక్తి
Fifa World Cup : మన దేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్ ని సపోర్ట్ చేసినంతగా మరే క్రీడని అభిమానించరు అంటే అతిశయోక్తి కాదు. కాగా ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా భారత్ లో లకూడ ఫుట్ బయట ప్రియులు చాలా మందే ఉన్నారని బయటపడుతుంది. ముఖ్యంగా కేరళలో రోనాల్డో, మెస్సీ ల కోసం భారీ కటౌట్ లు కట్టారు. అలానే ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా గెలిచిన తర్వాత భారీ ఎత్తున ర్యాలీ చేశారు.
ఆ ర్యాలీ కారణంగా అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లకు చెందిన అభిమానుల మధ్య చిన్న గోడవగా ప్రారంభమైన వివాదం… ముగ్గురు వ్యక్తులను కత్తితో పొడిచే వరకు వచ్చిందంటే వాళ్ళ పిచ్చి పీక్స్ లో ఉందని అర్దం అవుతుంది. అయితే తాజాగా కేరళకు చెందిన నూతన వధూవరులు ఫుట్ బాల్‌పై తమకు ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ప్రస్తుతం వారు చేసిన పనికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కేరళకు చెందిన సచిన్, అధీరా ఆదివారం రోజు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవదానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కాగా ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే రోజు జరిగింది. అర్జెంటీనా అటగాడు మెస్సీకి సచిన్ వీరాభిమాని కాగా… అధీరాకు ఫ్రెంచ్ టీమ్ అంటే ఇష్టం. అయితే ఫైనల్ మ్యాచ్ కి కొన్ని గంటల ముందే కొచ్చిలో వీరి పెళ్లి జరిగింది.
దాంతో సంప్రదాయ దుస్తులు, నగలతో పాటు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ జెర్సీని సచిన్, ఫ్రెంచ్ స్టార్ ఎంబాపై జెర్సీని అధీరా ధరించి పెళ్లి పీటలపై కూర్చున్నారు. వివాహమై విందు పూర్తయిన వెంటనే మ్యాచ్ తిలకించేందుకు… కొచ్చి నుంచి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురంలోని వరుడు ఇంటికి చేరుకున్నారు. చివరికి అర్జెంటీనా విజయం సాధించడంతో భర్త కోసం భార్య కూడా సెలెబ్రేషన్ లో భాగమైంది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.