Published On:

KTR: రైతు సమస్యలపై సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా!

KTR: రైతు సమస్యలపై సీఎం రేవంత్ చర్చకు సిద్ధమా!

KTR Challenge To CM Revanth: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతు రాజ్యం ఎవరిదో తేల్చుకునేందుకు చర్చ పెడదాం రావాలని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నానని అన్నారు. జులై 8న ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని తెలిపారు. 72 గంటలు సమయం ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి రావాలి. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్నారు. అన్నదాతకు సున్నం పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. చంద్రబాబు జల దోపిడికి వంత పాడుతోంది ఎవరో తెలియదా? చంద్రబాబు అసలు కోర్టు సీఎం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ప్రజాపాలన కాదు.. తెలంగాణలో చంద్రబాబు కోవర్టు పాలన సాగుతుందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని అభినందిస్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రైతు సమస్యలపై చింతమడలోనైనా, కొండారెడ్డిపల్లెలో అయినా సరే.. రేవంత్ రెడ్డితో చర్చకు రెడీ అన్నారు. కేసీఆర్ తో చర్చకు రేవంత్ రెడ్డి ముచ్చట పడుతున్నారు. కానీ కేసీఆర్ తో చర్చించే అంత స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్ లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల్లో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా కాంగ్రెస్ జెడ్పీటీసీ గెలవదని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటున్నారు. వంద సీట్లు గెలవాలంటే ముందు ప్రజలు వాళ్లకు ఓట్లు వేయాలి కదా అన్నారు. ఎరువులు ఇవ్వటం చేతకాని వాడికి కేసీఆర్ తో చర్చ ఎందుకని నిలదీశారు. ఏ రైతు, ఏ ఎద్దును అడిగినా వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆర్ అని చెప్తారన్నారు.

ఇవి కూడా చదవండి: