Published On:

Vivo V50e Discounts: ఈ ఫోన్ ఉంటే చాలు.. వేరే కెమెరా అక్కర్లేదు.. ఆఫర్లు బోలెడు ఉన్నాయ్..!

Vivo V50e Discounts: ఈ ఫోన్ ఉంటే చాలు.. వేరే కెమెరా అక్కర్లేదు.. ఆఫర్లు బోలెడు ఉన్నాయ్..!

Vivo V50e Discounts: మొబైల్ బ్రాండ్లు ప్రతిరోజూ కొత్త మొబైల్ ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇటీవలే వివో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘Vivo V50e’ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్‌లోకి కూడా వచ్చింది. మీరు ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. వివో V50e ఫోన్ శక్తివంతమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్‌లతో రూపొందించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్‌లో క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఇందులో అనేక AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ముందు, వెనుక రెండింటిలోనూ 50MP కెమెరాలతో వస్తుంది.

 

Vivo V50e Price
ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. దీని 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. మీరు ఈ ఫోన్‌ను సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.

 

Vivo V50e Offers
ఈ ఫోన్ HDFC, SBI బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 6 నెలల నో-కాస్ట్ EMIలో కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

 

Vivo V50e Specifications
ఆప్టిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. దీనికి 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మీరు ఫోటో క్లిక్ చేయాలనుకుంటే, స్పష్టమైన ఫోటో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ అందించారు. 5600mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఛార్జింగ్‌ సపోర్ట్ అందించారు.