Published On:

Realme 7th Anniversary Sale: రియల్‌మి వార్షికోత్సవ ఆఫర్లు.. ఆ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు.. ఏ వేరియంట్లపై ఎంతంటే..?

Realme 7th Anniversary Sale: రియల్‌మి వార్షికోత్సవ ఆఫర్లు.. ఆ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు.. ఏ వేరియంట్లపై ఎంతంటే..?

Realme 7th Anniversary Sale: రియల్‌మి ఈరోజు తన 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. ‘Realme 7th Anniversary Sale’ ని ప్రకటించింది. ఈ రియల్‌మి సేల్‌లో, కంపెనీ తన బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కంపెనీ తన అన్ని ఫోన్లలో అందుబాటులో ఉన్న ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో రియల్‌మి తన పి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.5000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ సేల్ రియల్‌మి అధికారిక వెబ్‌సైట్ రియల్‌మి.కామ్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

 

ఇప్పటివరకు 20 లక్షలకు పైగా పి సిరీస్ యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇది ఈ సిరీస్ అపారమైన ప్రజాదరణను చూపుతుందని కంపెనీ వెల్లడించింది. శక్తివంతమైన బ్యాటరీ, వేగవంతమైన ప్రాసెసర్, కొత్త ఫీచర్లతో మొబైల్ ప్రియులకు రియల్‌మి పి 3 లైనప్ గొప్ప ఎంపికగా మారింది.

 

Realme P3 Pro 5G Offers
స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్, గ్లో-ఇన్-ది-డార్క్ డిజైన్‌ను కలిగి ఉన్న రియల్‌మి పి3 ప్రో 5జి,రియల్‌మి వార్షికోత్సవ సేల్‌లో రూ.4,000 తగ్గింపుతో అమ్ముడవుతోంది. దీనితో పాటు, ఫోన్‌పై రూ. 1000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది, ఆ తర్వాత మీరు ఫోన్ బేస్ మోడల్ 8GB + 128GBని రూ. 18,999 కి కొనుగోలు చేయచ్చు. దీని 8GB + 256GB వేరియంట్‌ను రూ. 19,999 కు ఆర్డర్ చేయచ్చు. 12GB + 256GB వేరియంట్‌ను రూ. 21,999 కు ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 80వాట్స్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

Realme P3x 5G Offers
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 6000mAh బ్యాటరీతో వచ్చే రియల్‌మి పి3ఎక్స్ 5జీ ఈ సేల్‌లో రూ. 1000 డైరెక్ట్ డిస్కౌంట్, రూ. 1000 బ్యాంక్ డిస్కౌంట్‌తో అమ్ముడవుతోంది. ఫోన్‌పై డిస్కౌంట్ తర్వాత, మీరు ఫోన్ 6GB + 128GB మోడల్‌ను రూ. 11,999 కు కొనుగోలు చేయగలరు. 8+128 ని రూ.12,999 కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC తో వచ్చిన మొదటి ఫోన్. ఫోన్‌లో 10GB వర్చువల్ ర్యామ్ ఉంది. ఇది 6000mAh బ్యాటరీతో వస్తుంది. 45W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

Realme P3 5G Offers
స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్, 6000mAh బ్యాటరీతో వచ్చే రియల్‌మి పి3 5జీ ఈ సేల్‌లో రూ. 1000 డైరెక్ట్ డిస్కౌంట్, రూ. 1000 బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ. 2000 డిస్కౌంట్ తర్వాత రూ. 14,999 కు అమ్ముడవుతోంది. ఫోన్ రెండవ వేరియంట్ 8GB + 128GB మోడల్ రూ. 2000 బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 15,999 కు కొనుగోలు చేయచ్చు. ఫోన్‌లో GT బూస్ట్ ఫీచర్ అందించారు, ఇది AI మోషన్ కంట్రోల్ ,AI అల్ట్రా టచ్ కంట్రోల్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ IP69 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.