Last Updated:

Samsung Mobile Offers: సామ్‌సంగ్ రప్పా రపా.. రూ.69 వేల ఫోన్ రూ.29 వేలకే.. బ్యాంక్ ఆఫర్లు చూస్తే వదలరు..!

Samsung Mobile Offers: సామ్‌సంగ్ రప్పా రపా.. రూ.69 వేల ఫోన్ రూ.29 వేలకే.. బ్యాంక్ ఆఫర్లు చూస్తే వదలరు..!

Samsung Mobile Offers: ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కంపెనీ రిపబ్లిక్ సేల్‌లో భాగంగా బడ్జెట్ నుంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ ఊహకందని డిస్కౌంట్లను అందిస్తుంది. తాజాగా Samsung Galaxy S23 FE ధరను భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌ను రూ. 29,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయచ్చు. ఇది కాకుండా, వినియోగదారులు ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందుతున్నారు.

Samsung Galaxy S23 FE Offers
సామ్‌సంగ్ ఈ ఫోన్‌ను రూ.59,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. 8GB RAM + 128GB, 8GB RAM + 256GB. దీని టాప్ వేరియంట్ లాంచ్ ధర రూ.69,999. అయితే, లాంచ్ తర్వాత కంపెనీ ఫోన్ ధరను రూ. 5,000 తగ్గించింది, ఆ తర్వాత ఈ ఫోన్ రూ. 54,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. అదే సమయంలో దాని టాప్ వేరియంట్ రూ. 64,999కి జాబితా చేశారు.

ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో మీరు Samsung Galaxy S23 FEని రూ. 29,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయచ్చు. దాని టాప్ వేరియంట్ ధర రూ. 32,999గా ఉంది. ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా పాత ఫోన్‌పై రూ.9,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఇస్తున్నారు.

Samsung Galaxy S23 FE 5G Features
సామ్‌సంగ్ నుంచి వచ్చిన ఈ AI ఫీచర్ల ఫోన్ 6.4-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ డిస్‌ప్లే 120Hz హై రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ Samsung Exynos 2200 AI ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనితో, 8GB RAM + 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.

ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ పవర్ కోసం 4,500mAh బ్యాటరీతో 25W వైర్డ్ ,రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OneUIలో ఫోన్ పని చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. దీనితో, 3x ఆప్టికల్ జూమ్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8MP OIS కెమెరా  ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10MP కెమెరాను అందించారు.