Last Updated:

Poco X6 Neo 5G: రూ.11,999కే 5జీ ఫోన్.. 18 గంటల బ్యాటరీ లైఫ్, 108 MP ప్రైమరీ కెమెరా.. భారీగా డిస్కౌంట్లు..!

Poco X6 Neo 5G: రూ.11,999కే 5జీ ఫోన్.. 18 గంటల బ్యాటరీ లైఫ్, 108 MP ప్రైమరీ కెమెరా.. భారీగా డిస్కౌంట్లు..!

Poco X6 Neo 5G: పోకో నుంచి గత సంవత్సరం బడ్జెట్‌ సెగ్మెంట్‌లో ‘POCO X6 Neo 5G’ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఆకట్టుకొనేలా స్లిమ్‌ డిజైన్‌తో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్‌ ధరలో మార్కెట్లోకి వచ్చినా అనేక మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు ఉన్నాయి. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. 40 శాతం డిస్కౌంట్‌తో ఫోన్‌ను ఆర్డర్ చేయచ్చు. ఈ ఫోన్ ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Poco X6 Neo 5G Offers
పోకో ఎక్స్6 నియో 5జీ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. ప్రస్తుతం ఆన్ లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో రూ.4 వేల డిస్కౌంట్ అందిస్తుంది. 8GB ర్యామ్‌తో ఈ 5జీ ఫోన్‌ను కేవలం రూ.11,999కే కొనచ్చు. దీనికి ఎలాంటి బ్యాంక్ కార్డ్ లేదా కూపన్ అవసరం లేదు. మీరు రూ.12 వేల లోపు 5జీ మొబైల్ కొనాలని చూస్తుంటే ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.

Poco X6 Neo 5G Specifications
Poco X6 నియో 5G మొబైల్‌లో 6.72-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది పంచ్ హోల్ స్టైల్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లే.  1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంది.

Poco X6 నియో 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OSతో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం ఈ Poco ఫోన్ ARM Mali G57 MP2 GPUని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GB వర్చువల్ RAM,  16GB RAM ఉంది. ఇందులో 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

Poco X6 నియో 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ,   వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ ఉంది.

మొబైల్‌లో 5,000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 18 గంటల పాటు యూట్యూబ్ ప్లే చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఫోన్‌లో ఇన్‌ఫ్రారెడ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ సిమ్ 5G, USB టైప్-C, Wi-Fi, బ్లూటూత్ మొదలైనవి ఉన్నాయి.