Last Updated:

Amazon Deal: ఆఫర్ల అరాచకం.. సామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రాపై రూ.35 వేల డిస్కౌంట్.. డీల్ అదరహో..!

Amazon Deal: ఆఫర్ల అరాచకం.. సామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రాపై రూ.35 వేల డిస్కౌంట్.. డీల్ అదరహో..!

Amazon Deal: పాపులర్ సైట్ అమెజాన్ సామ్‌సంగ్ పాపులర్ ఫోన్లపై రూ.35000 డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో AI ఫీచర్లు 200 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. సామ్‌సంగ్ ఇటీవలే గెలాక్సీ ఎస్ 25 అల్ట్రాను విడుదల చేసింది. ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి గతేడాది విడుదలైన చాలా ఫోన్ల ధరలు తగ్గాయి. గత సంవత్సరం అత్యంత ప్రజాదరణ పొందిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన’ Samsung Galaxy S24 Ultra’ ప్రస్తుతం భారీ తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు.

 

ఈ ఫోన్ దేశంలో రూ. 1,29,900కి విడుదల చేశారు. అయితే ఇప్పుడు అమెజాన్‌లో రూ. 35 వేల కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, క్వాడ్ కెమెరా సెటప్, ఎస్ పెన్ సపోర్ట్, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కూడిన పెద్ద AMOLED డిస్‌ప్లే ఉంది. అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేక డీల్‌ను చూద్దాం.

 

Samsung Galaxy S24 Ultra Discount Offer
ప్రస్తుతం రూ. 35,309 భారీ తగ్గింపు తర్వాత, మీరు Samsung Galaxy S24 Ultraని రూ. 99,690కి కొనుగోలు చేయచ్చు. అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా కొనుగోలుదారులు దాని ధరను మరింత తగ్గించి, రూ. 2,990 వరకు ఆదా చేసుకోవచ్చు. అదనంగా EMI ఎంపిక కూడా పొందచ్చు, ఇది నెలకు రూ. 4,488 నుండి ప్రారంభమవుతుంది. బ్యాంక్ కార్డ్ ఆధారంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి.

 

మీరు మీ పాత ఫోన్‌ని కొత్త Galaxy S24 Ultra కోసం మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే మోడల్,పరిస్థితిని బట్టి రూ. 22,800 వరకు ఎక్స్ఛేంజ్ విలువను పొందుతారు. యాడ్-ఆన్‌ల కోసం కొనుగోలుదారులు రూ. 6,999కి సామ్‌సంగ్ కేర్+ యాక్సిడెంటల్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను రూ. 6,999కి టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను కూడా పొందచ్చు.

 

Samsung Galaxy S24 Ultra Specifications
గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 6.8-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ స్క్రీన్‌ని ప్రొటక్ట్ చేస్తుంది. దాని మన్నికను పెంచుతుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ ఉంది. 12GB వరకు ర్యామ్ అందుబాటులో ఉంటుంది. అలానే 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.

 

ఫోటోగ్రఫీ కోసం గెలాక్సీ S24 అల్ట్రాలో 200MP ప్రైమరీ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. వైడ్-యాంగిల్ షాట్‌ల కోసం 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్, హై-క్వాలిటీ సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. గెలాక్సీ AI ఫీచర్లు కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి.