Nothing Phone 2a Price Drop: బాబోయ్ ఇన్ని ఆఫర్లా.. నథింగ్ ఫోన్ 2aపై వేలల్లో డిస్కౌంట్లు.. అరాచకమే..!

Nothing Phone 2a Price Drop: ఏ కంపెనీ కూడా విభిన్న డిజైన్లతో ఫోన్‌లను విడుదల చేయడం లేదు. కానీ నథింగ్ ట్రాన్స్‌పాంట్ మొబైల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అలాగే, గత సంవత్సరం మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro ప్రాసెసర్‌తో Nothing Phone 2aని పరిచయం చేసింది. ఇప్పుడు, తన ఫోన్‌లపై తగ్గింపును ప్రకటించింది. మీరు రూ.2,000తో నథింగ్ ఫోన్ (2A) మొబైల్‌ని పొందచ్చు. డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. కంపెనీ ఈ ఫోన్ అన్ని వేరియంట్‌లను తక్కువ ధరకు విక్రయిస్తోంది. దీని గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Phone 2a Offers
నథింగ్ ఫోన్ 2A ప్రారంభ ధర రూ. 23,999. 8GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ప్రస్తుతం ఈ వేరియంట్‌ను రూ. 21,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయచ్చు. రూ.25,999కి లాంచ్ అయిన 8జీబీ + 256జీబీ వేరియంట్ ఇప్పుడు రూ.23,999కి అందుబాటులో ఉంది. రూ.27,999 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.25,999కి విక్రయిస్తోంది.
నథింగ్ ఫోన్ (2a) కొనుగోలుపై కంపెనీ అందించే ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మార్చి 26 వరకు. మీరు ఫోన్ అన్ని వేరియంట్లు, రంగు మోడల్‌లను చౌక ధరలకు కొనుగోలు చేయచ్చు. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు,మొబైల్ స్టోర్‌లలో ఈ ఆఫర్‌ను పొందచ్చు.
Nothing Phone 2a Features
నథింగ్ ఫోన్ (2a) స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే ఉంది. ఇది పంచ్ హోల్ స్టైల్ AMOLED స్క్రీన్. ఈ డిస్ప్లే 1,084 x 2,412 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది, 2160Hz PWM డిమ్మింగ్‌తో సహా అనేక ఫీచర్స్ ఉన్నాయి. దీనికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంది.
నథింగ్ ఫోన్ 2a మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ ఓఎస్ 2.5తో పని చేస్తుంది. ఫోన్‌లో 8జీబీ ర్యామ్+ 12జీబీ ర్యామ్ ఉన్నాయి. ఈ మొబైల్‌లో 8జీబీ ర్యామ్ బూస్టర్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 128జీబీ+256జీబీ స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.
అలానే OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. మొబైల్‌లో 5,000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 67W సూపర్‌వూక్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. కనెక్టివిటీ ఎంపికల విషయానికొస్తే, ఈ మొబైల్‌లో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-సి మొదలైనవి ఉన్నాయి.