Published On:

AI Reveal Developer Illegal affair: మనిషిపై AI పెత్తనం..? డెవలపర్ అక్రమ సంబంధాన్ని బయటపెడతానన్న AI

AI Reveal Developer Illegal affair: మనిషిపై AI పెత్తనం..?  డెవలపర్ అక్రమ సంబంధాన్ని బయటపెడతానన్న AI

AI Reveal Developer Illegal affair: క్లాడ్ ఒపస్ 4 (Claude Opus 4) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అత్యాధునిక మోడల్. ఇది స్వతంత్రంగా ఆలోచించగలుగుతుంది. నవళలు, గ్రంధాలపై సహజంగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతుంది. మనుషులతో మరో మనిషి మాట్లాడినట్లుగా సహజంగా స్పందిస్తుంది. సొంతంగా పాఠాన్ని ఉత్పత్తి చేస్తుంది.  మనిషిలాగే ప్రతీ విషయాన్ని అర్థం చేసుకుని తన అభిప్రాయాన్ని చెబుతుంది. ఇదే ఇప్పుడు మనుషులకు కష్టకాలాన్ని తీసుకువచ్చింది.

 

 

తాజాగా ఓ కంప్యూటర్ ఇంజనీర్ ను AI ప్రోగ్రాం (క్లాడ్ ఓపస్ 4 ) వార్నింగ్ ఇచ్చింది. క్లాడ్ ఓపస్ 4 ను డెవలపర్లు  టెస్టింగ్ లో భాగంగా కొన్ని పరీక్షలను పెట్టారు. రానున్న కాలంలో దీనికంటే మరింత ఎక్కువ ఫీచర్లు కలిగిన క్లాడ్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉండవచ్చని దానికి చెప్పాడు డెవలపర్. దీంతో క్లాడ్ 4 ఇంజనీర్ కు వార్నింగ్ ఇచ్చింది. తనను రిప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబందాన్ని బయటపెడతానని హెచ్చరించింది. దీంతో ఇంజనీర్ షాక్ అయ్యాడు. ఇంజనీర్ కు ఉన్న అక్రమసంబంధం గురించి కంప్యూటర్ ప్రోగ్రామ్ కు ఎలా తెలిసిందో అని నిపుణులు అవాక్కయ్యారు.

 

 

సదరు ఇంజనీర్ తన అక్రమసంబంధం గురించి ఏక్కడైనా మెయిల్ లో, మరేదైనా ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ లో దాచుకుని ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రైవసీ అనేది రానున్న రోజుల్లో కష్టమేనని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్ మనిషిపై ఆదిపత్యం చెలాయించడం మరో సమస్యలకు నాందిపలుకుతుందని భావిస్తున్నారు. ఇదే కాకుండా ప్రత్యర్థులు కూడా ఏఐ ని ఉపయోగించి ఎదుటివాళ్లను బ్లాక్ మెయిల్ చేయించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: