Home / Vijay Devarakonda
హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన కాజోల్ నటించిన దిల్ వాలే దుల్హానియా లే జాయింగే మళ్ళీ రీమేక్ అవబోతుంది అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి, అయితే ఈ రీమేక్ లో హీరో ఎవరనేదే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే ప్రేమ కథ చిత్రాన్ని చేస్తున్న విషయం విదితమే. ఈ సినిమా పై నెట్టింట అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్న క్రమంలో విజయ్ ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో ఈ మూవీని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
కాలేజీ రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా స్క్రీన్ పై చూసినపుడే ఆమె అభిమానిగా మారిపోయానని రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. కాగా ఈ సినిమా విడుదలయిన ముప్పై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. దానితో విజయ్ దేవరకొండ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది.
జనగణమన చిత్రం గురించి మర్చిపోండి అంటూ సైమా వేదికగా విజయ్ దేవకరకొండ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. కాగా నెటిజన్లు ఇంక జనగణమన ఆగిపోయినట్టేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిలో నిజానిజాలేంటో తెలియాలంటే పూరీ నోరువిప్పాల్సిందే.
లైగర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం జనగణమన పై దాని ప్రభావం పడింది. ఈ సినిమా నిర్మించే మై హోమ్ గ్రూప్ ప్రాజెక్టును వదిలేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిసింది.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్లో కుషి షూటింగ్లో ఉన్నాడు.
నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం రెండు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నాడు. అవి రామ్ చరణ్ - శంకర్ చిత్రం మరియు విజయ్ - వంశీ పైడిపల్లి చిత్రం. దిల్ రాజు ప్రభాస్ కోసం పెద్ద మొత్తంలో అడ్వాన్స్ చెల్లించాడు. అయితే ప్రభాస్ రాబోయే మూడు సంవత్సరాలు కూడ బిజీగా ఉన్నాడు.