Home / Uttarakhand
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు, 19 ఏళ్ల అంకితా భండారీ హత్యకు సంబంధించి అరెస్టయిన బిజెపి నేత కుమారుడు పుల్కిత్ ఆర్యకు చెందిన రిషికేశ్‌లోని వనతార రిసార్ట్ కూల్చివేసారు.
భారీ వర్షాలు, వరదలు ఉత్తరాఖండ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీటమునిగాయి. పిథోరగఢ్, ధార్చుల పట్టణంలో వరదలతో భారీగా నష్టం వాటిల్లింది. వరదలకు కాళి నది పొంగి పొర్లుతున్నది. దీంతో ఆ నది ఒడ్డున ఉన్న పలు ఇండ్లు దెబ్బతిన్నాయి.
జమ్మూ కశ్మీర్ లోని రియాసి జిల్లా కత్రా లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. వరదల కారణంగా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో రోడ్లన్నీ నీట మునిగాయి. దీంతో మాతా వైష్ణోదేవి తీర్థయాత్రను తాత్కాలికంగా రద్దు చేశారు.
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు, దీని అర్థం దేవుని భూమి. ప్రతీ ఏటా చార్ ధామ్ యాత్రకు లక్షలాదిమంది తరలివస్తారు . అయితే తీర్దయాత్రలకే కాకుండా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుదామనుకునే వారికి ఉత్తరాఖండ్ లో అద్బుతమైన ప్రదేశాలు వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ విధంగా వున్నాయి.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.