Home / Uttarakhand
శీతాకాలం ప్రవేశించిన నేపధ్యంలో ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని గురువారం మూసివేసారు. ఉదయం 8.30 గంటలకు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య ప్రార్థనలు చేసిన తర్వాత భక్తుల కోసం ఆలయ తలుపులు మూసివేసినట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరాఖండ్ పర్యటన సందర్భంగా మనా సమీపంలోని 11,300 అడుగుల ఎత్తులో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) డిఇటి వద్ద ఒక చిన్న సెమీ-పర్మనెంట్ తాత్కాలిక పైకప్పు కింద ఒక రాత్రి గడిపారు.
గత పాలకులు ప్రార్ధనా స్ధలాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురి చేశారని, నేటి కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా మనా గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు
ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ప్రధాని ఇవాళ కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి స్థానిక ఆచారం అయిన ప్రత్యేక వస్త్రధారణలో మోదీ కేథారనాథుడిని ఆలయాన్ని సందర్శించి బాబా కేదార్‌కు హారతి ఇచ్చారు.
కూతురిని జాగ్రత్తగా చూసుకో. ఆమెకు ఒంట్లో బాగాలేదు. ఇవి హెలికాప్టర్ పైలట్ అనిల్ సింగ్ తన భార్యతో చివరిసారిగా మాట్లాడిన మాటలు.
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ధామ్‌లో ప్రార్థనలు చేసి ఆలయానికి రూ.5 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.
పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 25 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 21 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరాఖండ్‌లోని ద్రౌపదిదండా-2 పర్వత శిఖరం నుండి హిమపాతంలో 20 మందికి పైగా చిక్కుకున్న తరువాత మొత్తం 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు
చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.