Home / Uttar Pradesh
ఇంట్లో ఉన్న పాముని తరిమికొట్టడానికి ఒక కుటుంబం చేసిన ప్రయత్నం విషాదాన్ని మిగిల్చింది. పాముకోసం పొగ బెట్టడంతో ఇంట్లో మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలో వస్తువులన్నీ బూడిదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో ఇప్పటివరకు 24 మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల డేటాను కలుపుకుంటే మరణాల సంఖ్య పెరుగుతుంది.
యూపీలో ఒక యువకుడు తన సోదరి వేరొక వ్యక్తిని ప్రేమించిందన్న కారణంగా ఆమె తలను నరికి దానితో పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటన సంచలనం కలిగించింది. . ఫతేపూర్ ప్రాంతంలోని మిత్వారా గ్రామంలో 22 ఏళ్ల రియాజ్ మరియు అతని 18 ఏళ్ల సోదరి ఆషిఫా మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లో గత మూడు రోజుల్లో వర్షాల కారణంగా కనీసం 34 మంది మరణించారు. గత 24 గంటల్లో పది మరణాలు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 34 మందిలో పిడుగుపాటుకు 17 మంది, మునిగిపోవడం వల్ల 12 మంది, భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు మరియు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ భారత అగ్రశ్రేణి రెజ్లర్ల నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢిల్లీ పోలీసు అధికారుల బృందం సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసాన్ని సందర్శించింది.
ఉత్తరప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వృద్ధాప్యంలో నిరాశ్రయులను రక్షించడానికి మరియు వారికి వృద్ధాశ్రమాలలో ఆశ్రయం కల్పించడానికి 'ఎల్డర్ లైన్' 14567 సేవతో ముందుకు వచ్చింది.గతంలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి నాయకత్వం వహించిన సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత) అసిమ్ అరుణ్ ఆలోచనకు రూపమే ఈ ఎల్డర్ లైన్.
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో గురువారం కొత్తగా పెళ్లయిన జంట వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం మరణించిన సంఘటన సంచలనం కలిగించింది. వధూవరులు గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.
ప్రధాన స్నానాల పండుగ తేదీలను ప్రకటించే హోర్డింగ్‌తో 2025లో జరిగే మహా కుంభమేళాకు అధికారికంగా కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం వెలుపల హోటల్ రాహి ఇలావర్ట్ ప్రాంగణానికి సమీపంలో 45 రోజుల పాటు జరిగే ఈ మెగా మతపరమైన ఉత్సవాల గురించి తెలియజేస్తూ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు గ్రేటర్ నోయిడాలోని మూడంతస్తుల ఇంటిలో విదేశీయులు ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ ల్యాబొరేటరీని ఛేదించారు. ఆఫ్రికన్ సంతతికి చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి 46 కిలోల డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం పోలీసులు తెలిపారు.
Uttar Pradesh: యూపీలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే.. బాలికలను లైంగికంగా వేధించాడు. ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా 18 మందిబాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.