Home / ts latest news
Bandi Sanjay: మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ తన అసమర్ధ పాలనతో దివాళా తీయించారని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించుకున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ ఆస్తులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో 9 అంశాలపై […]
Rtc Twitter Hacked: వరుస ట్విట్టర్ల హ్యాక్ లు కలకలం సృష్టిస్తున్నాయి. ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వాటి ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా రోజు చోటు చేసుకుంటున్నాయి. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్నాక.. ఆర్టీసీ ఎండీ ట్విట్టర్ హ్యాండిల్ ను చాలా ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఓ వైపు ఆర్టీసీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు చూపు ఆర్టీసీపై పడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ ఆఫీస్ […]
Yadadri: యాదాద్రి జిల్లాలో ఓ కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. సహజీవనానికి అడ్డుగా ఉన్నారని.. పిల్లల్ని వదిలేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. కన్నతల్లి ముగ్గురు పిల్లలను వదిలేయడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అండగా ఉంటాడనుకున్న తండ్రి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురి పిల్లల భారం చూడలేక.. తల్లి ఆ ముగ్గురిని వేరే ఊరిలో వదిలి వెళ్లిపోయింది. తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని […]
Brutal Murder: హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. హైదరాబాద్లోని పురానాపూల్ సమీపంలో జియాగూడ బైపాస్ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. @TelanganaDGP @hydcitypolice @HiHyderabad @swachhhyd What is wrong with law and order in Hyderabad ? Murder at New Road Ziaguda! pic.twitter.com/7z0n4McJYu — Dr Mohammed Moinuddin Hasan Altaf (Team Rahul INC) (@moinaltaf1973) […]
Manik Rao Thackrey: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. గాంధీ భవన్ లో నేడు ఆయన టీపీసీసీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఎవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని అన్నారు. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని సూచించారు. అధిష్ఠానం ఏం చెబితే అది చేయడమే తన […]
PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ […]
Secunderabad Fire Accident: సికింద్రాబాద్లోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అధికారులు ఓ అస్థి పంజరాన్ని గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు.. ముగ్గురు భవనంలో చిక్కుకుపోయారు. అయితే ఆ ముగ్గురిలో ఈ అస్థి పంజరం ఎవరిదో తెలియాల్సి ఉంది. నల్లగుట్టలో జరిగిన ఈ ప్రమాదంలో అధికారులు ఇప్పటివరకు ఒక మృతదేహన్ని గుర్తించారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది కనిపించకుండపోయారు. తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు వెళ్లారని సహచరులు తెలిపారు. తాజాగా మొదటి […]
Fire accident in Hyderabad: సికింద్రాబాద్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నగరంలో అలజడి రేపింది. ఉదయం అంటుకున్న సాయంత్రం వరకు అందుబాటులోకి రాలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆరంతస్తుల భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో.. సమీప ప్రాంతాల్లో భయం నెలకొంది. ఈ భవనంలో వ్యాపార సముదాయాలు.. పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 15 ఫైరింజన్లు వచ్చినా.. మంటలు అదుపుకాలేదంటే పరిస్థి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మంటలను అదుపుచేసే క్రమంలో ఇద్దరు ఫైర్ సిబ్బంది.. అస్వస్థతకు […]
Tandur: పప్పుల్లో చాలా రకాలు ఉంటాయి.. కానీ అందులో ఈ పప్పు వేరు.. కాదు కాదు ఇక్కడ పండించిన కందిపప్పే ప్రత్యేకం. అది ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే మన తాండూర్ వెళ్లాల్సిందే. ఇక్కడ పండించే కందిపప్పు చాలా ప్రత్యేకం.. ఈ పప్పుకు నాణ్యతలో మరేది సాటి రాదు.. అలాగే రుచి కూడా వేరు. అందుకే ఇక్కడ పండించే కందిపప్పుకు డిమాండ్ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఈ కంది పప్పుకు మంచి డిమాండ్ ఉంది. అందుకే […]
Bhuvanagiri: భువనగిరి జిల్లా కోర్డు సంచలన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితులను నిర్దోషులుగా పేర్కొంది. 2017లో అంబోజు నరేశ్ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. 2017 మే నెలలో నరేష్ అనే యువకుడు పరువు హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేవని.. న్యాయమూర్తి […]