Home / ts latest news
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు 2023-24 నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేశారు. ప్రముఖ కవి కాళోజీ వాక్కులతో.. పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
TSPSC Group 4: తెలంగాణలో కొలువుల జాతర మెుదలైంది. దానికి తగినట్లుగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఒక్కొక్కటిగా పరీక్ష తేదీలను టీఎస్పీఎస్పీ ప్రకటిస్తు వస్తుంది. తాజాగా గ్రూప్ -4 కు సంబంధించిన పరీక్ష తేదీని కమిషన్ ప్రకటించింది.
Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా బాగ్ లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుభకార్యాలకు ఉపయోగించే.. డెకరేషన్ సామాగ్రి దుకాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో.. డెకరేషన్ సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది.
Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం సద్దుమణగడంతో.. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయసభలను ఉద్దేశించి.. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ ప్రసంగం చేయనున్నారు.
Road Accident: సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలను చెందిన స్కూల్ బస్సును.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్ధులకు తీవ్రగాయలవ్వగా.. బస్సులో ఉన్న మరో పది మందికి సైతం గాయపడ్డారు.
Budget: గవర్నర్ తమిళి సై వ్యవహారంలో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ తీరుపై హై కోర్టుకు వెళ్లిన ప్రభుత్వం.. వెంటనే వెనక్కి తిరిగింది. గవర్నర్ పై దాఖలు చేసిన.. లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభిస్తామని.. ప్రభుత్వం తెలిపింది.
Kcr vs Governer: కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్న ఈ వివాదం.. ఇప్పుడు న్యాయస్థానం దాకా వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఓ వైపు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన బీఆర్ఎస్ నేతలు.. ఏకంగా హై కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.
Tslprb: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ప్రాథమిక పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.
Success Meet: వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చారు. వీరు ఒక్కసారిగా గేట్లను తోసుకొని ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చిరంజీవి అభిమానులు.. పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Hyderabad Roads: హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి దారుణంగా మారుతుంది. ఎప్పుడు ఏ రోడ్డు ఎలా కుంగిపోతుందో అని వాహనదారులు నిరంతరం భయపడుతున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 5 లో ఉన్న పళంగా రోడ్డు కుంగిపోయింది. పది అడుగుల మేర రోడ్డు కుంగిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఓ ట్రక్కు అందులో పడిపోయింది.