Home / ts latest news
Fire Accident Secunderabad: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేటలో ఈ ప్రమాదం సంభవించింది. డెక్కన్ నైట్ వేర్ కార్ల విడి భాగాల షాప్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా మంటలు దుకాణం అంతటా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తప్పిన భారీ ప్రమాదం.. మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నాయి. ఈ ప్రమాదం […]
Cm Kcr: కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని.. కేసీఆర్ అన్నారు. ఖమ్మం సభా వేదికగా మాట్లాడిన కేసీఆర్.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో కావాల్సినన్ని వనరులు ఉన్నాయని.. వాటిని ఉపయోగించుకుంటే విదేశీ రుణాలపై ఆధారపడాల్సిన పనిలేదని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (Cm Kcr )సంచలన ప్రకటన చేశారు. అధికారంలో రాగానే.. దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందజేస్తామని తెలిపారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగంలోనే ఉంచాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో దళితబంధు […]
Akhilesh Yadav: భాజపా కు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ Akhilesh Yadav అన్నారు. కేసీఆర్ కు తమ మద్దతు ఉంటుందని.. ఖమ్మం సభా వేదికగా అఖిలేష్ ప్రకటించారు. దేశంలో అరాచక పాలన సాగుతుందని.. ఆ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన అవసరం వచ్చిందని అఖిలేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కాపీ కొడుతుందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం కావాలనే […]
Social Media Influencers: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామరావు మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే వారి జాబితాలో కేటీఆర్ చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన మెుదటి 30 మందిలో మంత్రి స్థానం సంపాదించుకున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ (Minister Ktr) అరుదైన […]
Revanth Reddy: హైదరాబాద్ లో జరుగుతున్న నిజాం అంత్యక్రియలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపడం ఏంటని వస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించడాన్ని సమర్ధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన చౌమహల్లా ప్యాలెస్ లో చివరి నిజాం పార్ధివదేహనికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం రాజులు సృష్టించిన సంపద హైదరాబాద్ కే తలమానికం అని ఆయన అన్నారు. చివరి నిజాం ముఖరం ఝా […]
IT Rides Again: హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈ సారి దాదాపు 30 టీమ్ లు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నాయి. ఇటీవల వరుసగా హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోసారి ఈ దాడుల నేపథ్యంలో ప్రముఖులు అప్రమత్తం అవుతున్నారు. ఉన్నట్టుండి ఐటీ అధికారులు భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుమోసిన వ్యాపరవేత్త కార్యాలయాల్లో ఉదయం […]
Ntr death anniversary: నేడు ఎన్టీఆర్ 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా తారక రామారావు గుర్తింపు పొందారు. నటుడిగా ప్రేక్షకుల చేత.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా పేరుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎం […]
Medak: మెదక్ లో ఓ వ్యక్తి బీమా డబ్బుల కోసం ఆడిన డ్రామాను చూసి పోలీసులు కంగుతిన్నారు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి గోవాలో ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తి సజీవదహనం కేసు కీలక మలుపు తిరిగింది. బీమా డబ్బుల కోసమే డ్రైవర్‌ను వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం […]
Mukarram Jah: చివరి నిజాం రాజు.. ముఖరంజా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. శనివారం రాత్రి చివరి నిజాం మరణించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. చివిరి నిజాం Nizam Family మృతదేహాన్ని మంగళవారం ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్ కు తీసుకురానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్తారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. సాయంత్రం మక్కా మసీదులో ప్రార్థన […]
Hyderabad: మలక్ పేట్ బాలింతల మృతి కేసులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కారణమని వైద్యులు నిర్దారించారు. మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఇటీవలే ఇద్దరు బాలింతలు Two infants died మృతి చెందారు. మృతికి కారణం ఇదే.. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన సిరివెన్నెల.. తిరుపతికి చెందిన మరో మహిళా శివాణి ఇద్దరు ఏరియా ఆస్పత్రిలో కాన్పు చేయించుకున్నారు. అదే రోజు ఈ ఆస్పత్రిలో మరో తొమ్మది మంది కాన్పు చేయించుకున్నారు. […]