Home / Tirumala
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధికారులు పెద్దపీట వేశారు. సెప్టెంబరు 27 నుండి శ్రీవారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోసామాన్య భక్తులకు సులభంగా, శ్రీఘ్రంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పిస్తామని ఈవో ధర్మరెడ్డి తెలిపారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులందరూ మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. భక్తుల కోసం తిరుమల, అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.