Home / Tirumala
తిరుమల తిరుపతి దేవస్ధానం భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలను ఈ నెల 21 నుండి టిటిడి ఆన్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చని తితిదే ప్రకటించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24,25, నవంబర్ 8 మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ ఎన్నారై భక్తుడు భూరి విరాళాన్ని అందచేశారు. అమెరికాలో స్ధిరపడిన డేగా వినోద్ కుమార్, రాధిక రెడ్డిలు కోటి రూపాయల బ్యాంకు డీడీని తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి అందచేశారు.
ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభోత్సవాల్లో భాగంగా నేడు నేత్ర దర్శనంలో కనువిందుచేసిన శ్రీవారిని వీక్షించిన భాగ్యనగరవాసులు తన్మయత్నంలో మునిగిపోయారు.
హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో నిన్నటిదినం నుండి ప్రారంభమైన వైభవోత్సవాలు శ్రీవారిని భక్తులకు మరింత దగ్గర చేశాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవములు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో తలపెట్టిన ఈ ఉత్సవాలను అక్టోబర్ 11నుండి 15వ తేదీ వరకు తితిదే ఆధ్వర్యంలో ఉత్సవాలను అర్చక స్వాములు నిర్వహించనున్నారు. అంకురార్పణతో వైదిక క్రతువులు ప్రారంభించారు.
పవిత్ర పెరటాశి మాసం పురస్కరించుకొని తితిదే భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు కి.మీ మేర క్యూలైన్లలో వేచివున్నారు
పవిత్ర తిరుమలలో కన్నుల పండువుగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 5.69లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నారని టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి తెలిపారు.
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నేడు ముగిసాయి. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం నాడు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని అర్చకస్వాములు వైభవంగా నిర్వహించారు.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు. లలిత్ తిరుమల శ్రీవారిని దర్శించుకొన్నారు. సతీ సమేతంగా ఆలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకొన్న చీఫ్ జస్టిస్ కు టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు ఘన స్వాగతం పలికారు