Last Updated:

TTD: తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వమించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

TTD: తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

Tirumala: తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వమించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్‌ 27 వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

28 వతేదీన నూతన పరకామణి భవనాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పరికామణిలో భక్తులు కానుకల లెక్కింపు చూసే విధంగా అద్దలను ఏర్పాటు చేశారు. చిల్లర నాణాలను వేరే చేసే యంత్రాన్ని ఓ దాత విరాళమిస్తున్నట్లు ఈవో వెల్లడించారు. దీని విలువ 2 కోట్ల 5 లక్షలుగా తెలిపారు. అంతేకాక ఆనందనిలయం బంగారు తాపడం పనులపై ఆగమసలహా మండలి, పాలకమండలి సభ్యులతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటమని తెలిపారు.

follow us

సంబంధిత వార్తలు