Home / Tirumala
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. శోభయామానంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఉదయం చిన్న శేష వాహనంపై ఊరేగుతూ స్వామి వారు భక్తులకు కనువిందు చేసారు
ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలకు పైబడి అవుతున్నా నాడు గొంతెత్తిన గొంతులు మూగబోతున్నాయి. సరికదా ఇది చేస్తారనుకొన్నాము అంటూ ట్వీట్ లతో సరిపెట్టుకొంటున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై ప్రధాన పురోహితులు రమణ దీక్షితులు సీఎంకు ట్వీట్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్త పరిచడం చర్చగా మారింది.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది.
తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు
టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.
నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు.
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వమించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
తిరుమలలో శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనుంది. అయితే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల సర్వదర్శనానికే ప్రాధాన్యం కల్పించేలా ఆ తొమ్మిది