Home / Telangana Government
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
దక్షిణాదిన ప్రముఖ బొగ్గు గనుల కేంద్రాల్లో సింగరేణి కాలరీస్ సంస్ధ ఒకటి. విద్యుత్ వెలుగులు ప్రసాదించే ఆ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా కానుక ప్రకటించారు
ఇకపై తెలంగాణాలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ రానున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మందులను సత్వరంగా అందచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపటిదినం సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయి 6వేల కోట్లు చెల్లించకుండా ఉండేందుకే తెలంగాణ ప్రభుత్వం కోర్టు మెట్లు ఎక్కుతుందని ఏపిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు