Home / Telangana Government
తెలంగాణ రెవెన్యూ శాఖలో గత 80 రోజులుగా సమ్మె చేస్తున్న విఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించడంతో నేటినుంచి విధుల్లో చేరాలని విఆర్ఏలు నిర్ణయించారు.
ఆదాయ సమీకరణ మార్గాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించిన ప్రభుత్వం. తాజాగా రాజీవ్ స్వగృహ సహా ఇతర ఆస్తుల అమ్మకం చేపట్టనుంది.
తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
దక్షిణాదిన ప్రముఖ బొగ్గు గనుల కేంద్రాల్లో సింగరేణి కాలరీస్ సంస్ధ ఒకటి. విద్యుత్ వెలుగులు ప్రసాదించే ఆ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం కేసిఆర్ దసరా కానుక ప్రకటించారు
ఇకపై తెలంగాణాలో ప్రభుత్వ మెడికల్ స్టోర్స్ రానున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు మందులను సత్వరంగా అందచేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ వ్యాప్తంగా 12 స్టోర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపటిదినం సెలవుదినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు శాసన సభలో ఎనిమిది బిల్లులను సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది.