Home / Sports News
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఖరి మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీం ఇండియా మైదానంలో అదరగొట్టింది. సిరీస్ నెగ్గాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో భారత బౌలింగ్ దళం సపారీ జట్టుపై బంతులతో చెలరేగిపోయింది.
నేడు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్ణయాత్మక పోరు జరుగునుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టీం ఇండియా రెండో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది.
ఇటీవల ముగిసిన ఆసియాకప్ లో అత్యధిక పరుగులు చేసినా జాబితాలో మొదటి స్థానంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ రిజ్వాన్ నిలిచాడు.ఈ అవార్డును వరదలతో ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్ ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ వెల్లడించాడు.టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఈ సిరీస్ లో హర్మన్ ప్రీత్ ఏకంగా 221 పరుగులు చేసింది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్ పదవి రేసులో ఉన్నాడన్న వార్తల నేపధ్యంలో అతని వారసుడు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
టీ20 ప్రపంచకప్ ముంగిట టీం ఇండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి ఈ టోర్నీకి దూరం అయ్యారు. కాగా ఇప్పుడు ప్రపంచకప్ స్టాండ్ బై బౌలర్లలో ఒకరైన దీపక్ చాహర్ కూడా గాయపడ్డాడు.
ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచకప్ తన కెరీర్లో "ఖచ్చితంగా" చివరిది అని అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ గురువారం ప్రకటించారు.
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లక్నోలో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో 250 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 8 వికెట్లకు 240 పరుగులు మాత్రమే చేసింది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది.
టీ20 ప్రపంచకప్‌కు దూరమవ్వడంపై జస్ప్రీత్ బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. మెగా టోర్నీ నుంచి తప్పుకోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. తాను గాయం నుంచి కోలుకోవాలని కోరుకున్న పత్రీ ఒక్కరికి బుమ్రా ధన్యవాదాలు చెప్పారు. ఆస్ట్రేలియా వెళ్లి టీమిండియాకు మద్దతు తెలుపుతానంటూ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియాలో జరిగే ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2022లో విజేతకు $1.6 మిలియన్లు లేదా రూ. 13 కోట్ల చెక్కు ప్రైజ్ మనీగా దక్కుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసిసి ) ఈ రోజు ప్రకటించింది.