Home / Sports News
మొదటి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 120 బాల్స్ కు 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ అర్థ సెంచరీతో 63 పరుగులు, స్టాయినిస్ 35 పరుగులు చేసి వీరిద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
డిసెంబర్ 4 నుండి 26వరకు బంగ్లాదేశ్ లో జరగనున్న క్రికెట్ పోటీల్లో టీమిండియా జట్టును బీసిసిఐ ప్రకటించింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పాడు. 'పిచ్‌లో మాకు అనుకూలంగా లేదని మేము ముందే అర్దం అయింది
పెర్త్ మైదానం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ మొదటి నుంచి తడబడుతూ ఆడిన భారత బ్యాటర్ల టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైందని చెప్పవచ్చు. సఫారీల బంతుల ధాటికి టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయింది. కాగా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి టీం ఇండియా 133 పరుగులు చేసింది.
టీమిండియా, నెదర్లాండ్స్ జట్ల మధ్య సిడ్నీ వేదికగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ ముందు 180 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేయడంతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగుల్లో టాప్-10లోకి దూసుకొచ్చాడు.
పుట్టిన గడ్డను స్మరించుకోవడం దేశ పౌరుడిగా అందరి హక్కు. పొరుగు దేశంలో దేశంపై ఉన్న అభిమానాన్ని పంచుకొన్నాడు మన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సంఘటన దాయాది పోరు మ్యాచ్ చోటుచేసుకొనింది. దీన్ని ఐసిసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అయింది.
ప్రపంచ టోర్నీకే వన్నెతెచ్చే అసలు సిసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్ సూపర్-12లో భాగంగా నేడు దాయాది దేశమైన పాకిస్థాన్‌తో భారత్ సమరానికి సిద్ధమయ్యింది. బరిలోకి దిగి ఫేస్ టు ఫేస్ తలపడనున్నాయి ఇరు జట్లు. ఈ పోరుకు మెల్బోర్న్ మైదానం వేదిక కానుంది.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ NFT ప్లాట్‌ఫారమ్ రారియోతో పెట్టుబడిదారుడిగా భాగస్వామిగా మారాడు. ఈ ఒప్పందంలో భాగంగా, టెండూల్కర్ స్టార్టప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తాడు.
2023లో జరగనున్న ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జే షా చెప్పారు .