Home / Sports News
బంతిని పాలిష్ చేయడానికి లాలాజలాన్ని ఉపయోగించడం పై నిషేధం అంతర్జాతీయ క్రికెట్లో కోవిడ్ -19 కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమలులో ఉంది. ఇపుడు దీనిని శాశ్వతంగా నిషేధిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో 200 మందికి పైగా కబడ్డీ ఆటగాళ్లకు స్టేడియం టాయిలెట్లో ఉంచిన ప్లేట్ల నుండి అన్నం వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి,
ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్‌లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది.
భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా మరో ఘనత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్లో 4 పతకాలు గెలిచిన తొలి రెజ్లెర్ గా బజరంగ్ చరిత్రకెక్కాడు.
యువరాజ్ సింగ్ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టి నేటికీ 15 ఏళ్ళు , టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్ల క్రితం టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ క్రికెట్ చరిత్రలో ఒక మైలు రాయిని సృష్టించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ దూరమయ్యారు. కరోనా కారణంగా అతను ఈ సిరీస్ కు దూరం కాగా అతని ప్లేస్‌లో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు.
భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20కి ముందు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించకపోతే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవలేదని అన్నాడు.
సంజూ శాంసన్ అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించింది. న్యూజిలాండ్-ఏతో ఇండియాలో జరిగే మూడు వన్డేల సిరీసులకు భారత సెలక్టర్లు జట్టును ప్రకటించారు.
అభిమానులకు టెన్నిస్ దిగ్గజం స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెడరర్ భారీ షాక్ ఇచ్చారు. టెన్నిస్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఫెడరర్, వచ్చే వారం ఆరంభమయ్యే లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ తన కెరీర్ లో చివరి టెన్నిస్ టోర్నమెంట్ అంటూ ఫెడరర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించాడు.
భారత స్టార్ రెజ్లర్, కామన్వెల్త్ 2022 స్వర్ణ పతక విజేత వినేశ్ ఫొగాట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ తరపున రెండు కాంస్యాలు నెగ్గిన తొలి రెజ్లర్‌గా చరిత్రకెక్కింది.