ICC T20 Rankings: ఐసీసీ T20 ర్యాంకింగ్స్.. టాప్ టెన్ లో కోహ్లికి దక్కని స్దానం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆకట్టుకున్నప్పటికీ ఐసీసీ పురుషులT20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుండి నిష్క్రమించాడు.
ICC Rankings: ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆకట్టుకున్నప్పటికీ ఐసీసీ పురుషుల T20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుండి నిష్క్రమించాడు. విరాట్ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు మరియు జాతీయ జట్టు తరపున 246 పరుగులు చేశాడు. అయితే, బంగ్లాదేశ్‌పై విరాట్ పేలవమైన ప్రదర్శన కారణంగా అతను టాప్ 10 నుండి నిష్క్రమించాడు.
మరోవైపు మరో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ T20 ప్రపంచ కప్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో 225 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో ఇప్పటికే మూడు అర్ధసెంచరీలు చేసాడు. జింబాబ్వే పై యాదవ్ యొక్క ఇన్నింగ్స్ అతను నంబర్ వన్ స్థానాన్ని పొందడంలో సహాయపడింది. మొహమ్మద్ రిజ్వాన్, డెవాన్ కాన్వే మరియు బాబర్ ఆజం మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన ఫిన్ అలెన్ మరియు భారత్‌కు చెందిన కెఎల్ రాహుల్ వరుసగా ఆరు మరియు ఐదు స్థానాల్లో ఉన్నారు.
T20 నెంబర్ వన్ బౌలర్ గా హసరంగా..
శ్రీలంకకు చెందిన హసరంగా ప్రపంచకప్ లో తన బౌలింగ్ ప్రతిభతో T20 నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. .అతను ఆఫ్ఘనిస్తాన్‌పై 3/13 మరియు ఇంగ్లండ్‌పై 2/23 తో అత్యుత్తమ లెగ్ స్నిన్నర్లలో ఒకరిగా నిలిచాడు.