Home / Sports News
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.
హరారే వేదికగా జరిగిన చివరి వన్డేలో 13 పరుగుల తేడాతో జింబాబ్వే పై విజయం సాధించి భారత్, మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే తొలి రెండు వన్డేల్లో పోరాట పటిమ చూపించని జింబాబ్వే చివరి వన్డేలో మాత్రం అద్భుత పోరాటం చేసి ఔరా అని పించింది.
భారత్- జింబాబ్వే మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై భారత క్రికెట్ జట్టు 10 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది.
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.
రేపటి నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు ఆడనుంది. అయితే వన్డే సిరీస్ కు ముందు భారత్ ను గాయాల బెడద వెంటాడుతుంది. యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో జట్టు నుంచి తప్పుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో చివరి రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. వెయిట్‌లిఫ్టర్లు, రెజ్లర్లు, బాక్సర్ల తరహాలోనే షట్లర్లు సైతం చక్కటి ప్రదర్శన చేయడంతో బర్మింగ్‌హామ్ క్రీడలను భారత్ ఘనంగా ముగించింది. చివరి రోజు మరో నాలుగు స్వర్ణాలు భారత్ ఖాతాలో జమ అయ్యాయి. అందులో మూడు బ్యాడ్మింటన్‌లో వచ్చినవే.
యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించారు సెలక్టర్లు. ఆసియా కప్ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు.
బ్రిటన్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్‌ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్‌కు దూసుకెళ్లింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.