Home / Sports News
బుధవారం అఫ్గాన్, పాక్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో చివరివరకూ సాగింది. మ్యాచ్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో పాక్‌కు 11 పరుగులు కావాలి. ఫజల్ హక్ ఫారూఖీ వేసిన తొలి బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన నసీమ్ షా సిక్సర్‌గా మలిచాడు.
ఆసియా కప్పు టైటిలే ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు. అనుకోకుండా ఫైనల్ కు దూరమైయ్యింది. కాగా ఫైనల్స్ దూరమైనా తన పరాజయాన్ని చూపించకుండా లాస్ట్ మ్యాచ్ గెలవడంతోనైనా కొంత విజయ ఊరటను పొందాలని అనుకుంటుంది. నేడు టీంఇండియా ఆఫ్ఘాన్ తో తలపడనుంది.
ఆసియా కప్ 2022 భాగంగా టీమిండియా ఫైనల్ ఆశలు ఆవిరి ఐపోయాయి. నిన్న రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంక పై ఘోరంగా ఓడిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. మంగళవారం ట్విట్టర్ లో అతను ఈ విషయాన్ని ప్రకటించాడు. మంగళవారం, అతను ట్విట్టర్లో ఈ ప్రకటన చేసాడు. నా దేశం మరియు రాష్ట్రమైన యుపికి ప్రాతినిధ్యం వహించడం ఒక సంపూర్ణ గౌరవం.
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఆల్ ఫార్మట్‌లో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. మహిళా విభాగం, పురుషులు విభాగం రెండింటిలో టీ20 లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.అలాగే ఆసియాకప్-2022లో మొన్న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ తో 28 పరుగులు కొట్టి ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతక ముందు వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ బ్యాటర్ సుజీ బేట్స్ 3531 పరుగులతో ఉంది.
ఆసియా కప్ 2022 బుధవారం హంకాంగ్ జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఆట తీరుకు సీనియర్ క్రికెటర్ల నుంచి ప్రసంసలను అందుకున్నారు. కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేయగా వీటిలో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ తో కోహ్లీ బాగా ఆడటం లేదని విమర్శలు చేసిన వాళ్ళకి తన బ్యాట్ తో గట్టి సమాధానమే చెప్పాడు.
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.
మేలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల సీఓఏను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేయడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తివేసింది. దీనితో అక్టోబర్‌లో జరిగే మహిళల U-17 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి అడ్డంకులు తొలగిపోయాయి.
కొంతమంది వయస్సు కేవలం ఒక సంఖ్య అని చెబుతారు. ఇప్పుడు జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2022లో 64వ రౌండ్లో మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో గెలుపొందడం ద్వారా ఇజ్రాయెల్‌కు చెందిన 64 ఏళ్ల బ్యాడ్మింటన్ క్రీడాకారిణి స్వెత్లానా జిల్బెర్మాన్ అది నిజమని నిరూపించింది.
ఆసియ కప్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారతజట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో ఆసియాకప్ కు ద్రావిడ్ దూరమయినట్లే.