Asia Cup 2022: కొత్త రికార్డ్ సృష్టించిన కింగ్ కోహ్లీ
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన విశ్వరూపం చూపించి, సెంచరీ చేసి కొత్త రికార్డ్ సృష్టించారు. చాలా రోజుల తరువాత బ్యాట్ పట్టుకున్న కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై చెలరేగి 61 బాల్స్ కు 122 పరుగులు (వీటిలో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ) చేసి నాటౌట్ గా నిలిచాడు.
Asia Cup 2022: నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోహ్లీ తన విశ్వరూపం చూపించి, సెంచరీ చేసి కొత్త రికార్డ్ సృష్టించారు. చాలా రోజుల తరువాత బ్యాట్ పట్టుకున్న కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ పై చెలరేగి 61 బాల్స్ కు 122 పరుగులు (వీటిలో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ) చేసి నాటౌట్ గా నిలిచాడు. తన పై విమర్శలకు ఈ సెంచరీతో ఘాటుగా సమాధానమిచ్చాడు.
విరాట్ కోహ్లీ సరిగా ఆడటం లేదని, ఇక పై అతన్ని టీంలో ఉంచిన అతడు ఆడలేడని, అతడిని టీంలో ఇంకా ఎందుకు ఉంచుతున్నారంటూ ? కోహ్లీ కన్నా బాగా ఆడే ఆటగాళ్లు బెంచ్ కేపరిమితమయ్యారని ఇలా ఎన్నో పలు రకాల విమర్శలు తన పై వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా అతను తన ఆటను మాత్రమే నమ్ముకొని, మధ్యలో విరామం తీసుకొని మళ్ళీ ఆడటం మొదలు పెట్టి, కొత్త రికార్డ్ ను సృష్టించాడు.
క్రికెట్ చరిత్రలో టి20 బ్యాటింగ్ ఫార్మాట్లో 100 సిక్సర్ల కొట్టిన రెండో భారత బ్యాటర్ కోహ్లీ కొత్త రికార్డును సృష్టించారు. ఈ లిస్టులో మొదటి స్థానంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నారు. టి20 బ్యాటింగ్ ఫార్మాట్లో 3,500 పరుగుల మార్కును అందుకొని రెండో భారత బ్యాటర్ గా కోహ్లి ఉన్నారు. ఈ లిస్టులో రోహిత్ శర్మ 3,620 పరుగులు చేసి మొదటి స్థానాన్ని అతను కైవసం చేసుకున్నారు.