Home / Rahul Gandhi
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం కాలేజీ విద్యార్థిని నడుపుతున్న స్కూటీ వెనుక కూర్చుని కనిపించారు. జైపూర్‌లో ఒక రోజు పర్యటనలో రాహుల్ గాంధీ మహారాణి కళాశాలలో ప్రతిభావంతులైన బాలికలకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు.
గురువారం, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి ప్రజలను మరోసారి ఆశ్చర్యపరిచారు, అక్కడ ఆయన రైల్వే పోర్టర్లతో సమావేశమయి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు పోర్టర్ దుస్తులు ధరించి లగేజ్ కూడా మోసారు.
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనుండగా.. రేపు సాయంత్రం తుక్కగూడలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలోని మైసూరులో 'గృహ లక్ష్మి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ ఇంటి పెద్దలుగా ఉన్న దాదాపు 1.1 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ.2,000 సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా భారత్ భూమిని ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ మరోసారి ఆరోపించారు. శుక్రవారం లడఖ్‌లోని కార్గిల్‌లో ఆయన మాట్లాడుతూ లడఖ్‌లో ఒక్క అంగుళం కూడా చైనా స్వాధీనం చేసుకోలేదని విపక్షాల సమావేశంలో ప్రధాని అనడం బాధాకరం.. ఇది అబద్ధం అని వ్యాఖ్యానించారు.
లడఖ్‌లో బైక్ యాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖర్దుంగ్లా పర్వత మార్గం వద్దకు చేరుకున్నారు. తూర్పు లడఖ్‌లోని పాంగోంగ్ సరస్సులో రాహుల్ తన తండ్రి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని జరుపుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనను చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో పెద్ద సీన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ మహిళా ఎంపీలు దీనిపై లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రాహుల్‌గాంధీకి బీహార్ ఎమ్మెల్యే నీతూ సింగ్ అండగా నిలిచారు.
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర హోమంత్రి అమిత్‌షా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఈ సభలో ఒక వ్యక్తి 13 సార్లు రాజకీయ కెరీర్ ప్రారంభించి, 13 సార్లు ఫెయిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు.
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి శోభా కరంద్లాజే మరియు ఇతర పార్టీ మహిళా సభ్యులు రాహుల్ గాంధీపై బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలోని మహిళా సభ్యుల గౌరవాన్ని అవమానించడమే కాకుండా, ఈ సభ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా సభ్యుని ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.