Home / PM Modi
బిలియనీర్ గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో ఇద్దరి ఫోటోను చూపిస్తూ ప్రశ్నించారు.
LUH HELICOPTER: రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. కర్ణాటకలోని తుంకూరు కేంద్రంగా.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెలికాప్టర్ తయారీ పరిశ్రమను ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ ప్రారంభించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023 - 24 కేంద్ర బడ్జెట్ ను ఆమె సమర్పించారు. ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ ఐదోసారి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇక్కడ విశేషం. ప్రతీసారి లాగే ఈసారి కూడా నిర్మల సీతారామన్ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. సంప్రదాయ చీరకట్టులో ఆమె పార్లమెంటుకు హాజరయ్యారు.
Mahatma Gandhi: భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వారిలో మెుదటి వ్యక్తి మహాత్మ గాంధీ. ఎంతో మంది మహానుభావులలో గాంధీ పేరు ముందు ఉంటుంది. దేశ స్వాతంత్ర్యంలో గాంధీ పాత్ర అలాంటిది. సత్యాన్ని చేతపట్టి.. బ్రిటిష్ వారిని పారదోలిన గొప్ప నేత గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే. గాంధీ లేకుంటే.. దేశం స్వాతంత్య్రాన్ని పొందేది కాదు. అలాగే గాంధీ చేసిన సేవలను దేశం ఎన్నటికి మరవదు.
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బీబీసీ..
బీబీసీ డాక్యుమెంటరీను షేర్ చేసే పలు యూట్యూబ్ వీడియోలను, ట్వీట్లను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే సంబంధిత యూట్యూబ్ వీడియోలు కలిగి ఉన్న 50కి పైగా ట్వీట్లను బ్లాక్ చేయాలని ట్విట్టర్‌ని కేంద్రం ఆదేశించింది.
PM Modi Telangana Tour : తెలంగాణలో మోదీ పర్యటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో మోదీ పర్యటన తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చేపట్టిన ఆధునీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఐఐటీ హైదరాబాద్ లో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. వీటితోపాటుగా మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాస్తవానికి జనవరి 19న మోదీ హైదరాబాద్ […]
రోజ్‌గార్ మేళా కింద వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థల్లో కొత్తగా చేరిన వారికి 71,000 నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.
సినిమాల వంటి అసంబద్ధ అంశాలపై అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.