Home / PM Modi
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఒడిశాలో మొదటి వందే భారత్ రైలును (పూరీ-హౌరా)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రయాణించే రెండవ వందే భారత్ రైలు కావడం విశేషం.
Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మంత్రిత్వ శాఖలను మార్చుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్లోని జామ్నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు
రోజ్గార్ మేళా కింద, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ప్రతి పథకం మరియు ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్లోని గాంధీనగర్లో 4,400 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు 19,000 మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు ఒకరోజు పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో రూ.5,500 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాజస్థాన్లోని నాథ్ద్వారాలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు.మీరు ఎల్లప్పుడూ నాపై ప్రేమ మరియు ఆప్యాయతలతో ముంచెత్తారు. ఇది నాకు దైవిక ఆశీర్వాదంగా అనిపిస్తుందని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
ఓటు వేసేటపుడు ‘జై బజరంగబలి’ అనండి అంటూ కర్ణాటక ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కోరారు. బజరంగ్దళ్ని నిషేధిస్తానని హామీ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బజరంగబలి ని నిషేదిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కర్ణాటకలో పద్మ అవార్డు గ్రహీతలు తులసి గౌడ, సుక్రి బొమ్ము గౌడలను కలిశారు.కర్ణాటకలోని ముద్బిద్రిలో జరిగిన ర్యాలీలో ప్రధాని బుధవారం ప్రసంగించారు. అనంతరం ఇద్దరు మహిళలతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన 'విష పాము' వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం స్పందించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం నన్ను పాముతో పోల్చి ఓట్లు వేయవద్దని అడుగుతోంది కానీ పాము అంటే శివుని మెడలోని అలంకారం.