Home / national news
ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు.
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు.
కుల వివాదం కేసులో ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు కుల పరిశీలన కమిటీ శనివారం క్లీన్ చిట్ ఇచ్చింది. వాంఖడే పుట్టుకతో ముస్లిం కాదని ఆ ఉత్తర్వు చెబుతోంది.అతను మరియు అతని తండ్రి ఇస్లాంలోకి మారినట్లు ఇంకా రుజువు కాలేదని, అయితే, వారు హిందూ మహర్ 37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని రుజువైంది.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి శనివారం రెండోసారి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది.ట్విట్టర్లో, పార్టీ ఎంపీ మరియు కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్, "ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం సోనియా ఐసోలేషన్‌లో వున్నారని రాసారు.
రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ జరుపుకొన్న రక్షాబంధన్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలోని భవానీ అమ్మన్ ఆలయానికి రూ. 46.31 కోట్ల విలువైన బంగారు డిపాజిట్ బాండ్‌ను అందజేశారు. 91.61 కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు (రూ. 46.31 కోట్ల విలువైన బంగారంతో తయారు చేయబడ్డాయి).
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ,పశువులకు సంక్రమించే లంపీ చర్మవ్యాధి బారి నుంచి వాటిని రక్షించడానికి దేశీయంగా రూపొందించిన లంపీ ప్రో వాక్ ఇండ్‌ను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ వాక్సిన్ ను ఇజ్జత్ నగర్, బరెలి లోని ఇండియన్ వెటనరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్
ఉత్తరప్రదేశ్ ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బాందా దగ్గర యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పటికి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కనీసం పది క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలపై విచారణ జరుపుతోంది. ఇన్స్టంట్ లోన్ యాప్ కేసులో దర్యాప్తులో ఉన్న నిందితుల నేరాల ద్వారా రూ. 1,000 కోట్లకు పైగా నగదును లాండరింగ్ చేసినట్లు గుర్తించారని వాటిలో చాలా వరకు చైనా లింక్‌ను కలిగి ఉన్నాయని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది . దీన్ని ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.