Home / national news
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, 12వ తరగతి ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం, మొత్తం ఉత్తీర్ణత శాతం 91.71% ఉంది.బాలురు కంటే బాలికలు ఫలితాల్లో మెరుగ్గా ఉన్నారు.బాలికల ఉత్తీర్ణత శాతం: 94.54% కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 91.25%గా వుంది.
రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. ఈ ఓట్ల విలువ 5,23,600. ఇందులో 3,78,000 విలువైన 540 ఓట్లను ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకి లభించాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 1,45,600 విలువైన 208 ఓట్లు వచ్చాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. మూడు గంటలపాటు విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని, తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు.
భారతదేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కరువు దిశగా పయనిస్తోంది. భారత వాతావరణ శాఖ డేటా ప్రకారం, దాని 75 జిల్లాల్లో(96 శాతం) జూలై 20, 2022 వరకు 'సాధారణం కంటే తక్కువ' వర్షపాతం నమోదైంది. 75 జిల్లాల్లో యాభై తొమ్మిది జిల్లాల్లో ‘అత్యంత తక్కువ’ వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలు ‘పెద్ద లోటు’ను ఎదుర్కొంటున్నాయి,
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్సైట్, icar.nta.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చైనా పొరుగు దేశాల సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలతో బరితెగిస్తోంది. తాజాగా భూటాన్ వైపునున్న డోక్లామ్ పీఠభూమికి తూర్పు వైపున 9 కిలోమీటర్ల దూరంలో అమూచు నదీ లోయలో ఒక కొత్త గ్రామాన్ని నిర్మించింది. ఇలాంటి కృత్రిమ గ్రామాలను ‘పంగ్డా’ అని చైనా పిలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి మరికాసేపట్లో ఈడీ ముందుకు హాజరు కానున్నారు. గత నెలలో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వెళ్లలేక పోయారు. దాంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని 5 రోజులు విచారించిన ఈడీ, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది.
దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను ఇప్పటికే పార్లమెంట్
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ అంబులెన్స్ టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. రోగిని త్వరితగతిన ఆసుపత్రికి తరలించే క్రమంలో మితిమీరిన వేగంతో వచ్చిన సదరు అంబులెన్స్ ఓ టోల్ ప్లాజా వద్ద అదుపు తప్పింది.
కేరళ కొల్లాం జిల్లాలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కి హాజరయ్యే ముందు తమ ఇన్నర్వేర్లను తొలగించమని బాలికలను కోరిన సంఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి చెందిన ముగ్గురు, కాలేజీకి చెందిన ఇద్దరు ఉన్నారు.