Dalit Student Dead: పరీక్షలో తప్పు రాశాడని.. విద్యార్థిని కొట్టి చంపిన టీచర్
పరీక్షలో ఒక పదం తప్పు రాయడం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పదం తప్పరాస్తావా అంటూ ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా చితకబాదడం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగింది.
Dalit Student Dead: పరీక్షలో ఒక పదం తప్పు రాయడం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పదం తప్పరాస్తావా అంటూ ఒక దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా చితకబాదడం వల్ల తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా ఔరియాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే నిఖిల్ డోహ్రే 10వ తరగతి చదువుతున్నాడు. కాగా పరీక్షలో ఒక పదం తప్పు రాసినందుకు సెప్టెంబర్ 7న సోషల్ సైన్స్ టీచర్ అశ్విని సింగ్, నిఖిల్ ను విచక్షణారహింతగా చితకబాదాడు. దీనితో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వారి తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయమై సెప్టెంబర్ 24న నిఖిల్ తండ్రి రాజు డోహ్రె అచ్చలద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఆధిపత్య కులానికి చెందిన అశ్విని సింగ్ అనే టీచర్ కులం పేరుతో తరగతి గదిలో నిఖిల్ను తిట్టాడని, కులం ఆధారంగానే తన కొడుకును కర్రలతో, రాడ్డుతో కొట్టాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడి తండ్రి రాజు పేర్కొన్నాడు.
ఈ విషయమై ఇటావా సీఎంఓతో మాట్లాడామని, కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని, నిజానిజాల్ని బట్టి చర్యలు తీసుకుంటామని ఔరియా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ చారు నిగమ్ తెలిపారు.
ఇదీ చదవండి: లోయలో పడిన టెంపో.. 7 మంది మృతి