Home / Narendra modi
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
ప్రధాని మోదీ దక్షిణభారత దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ను బెంగళూరులో జెండా ఊపి ప్రారంభించారు . నేడు ఆయనరూ. 25,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
గుజరాత్ రాష్ట్రాన్ని దేశ రక్షణ కేంద్రంగా మార్చేందుకు ప్రధాని మోదీ కీలక అడుగులు వేశారు. ఇండియా-పాకిస్థాన్ సరిహద్దులోని దీసాలో కొత్త ఎయిర్ బేస్ కు ప్రధాని శంకుస్ధాపనం చేశారు
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. దీని తర్వాత అక్టోబర్ 11న మధ్యప్రదేశ్ పర్యటనకు మోదీ వెళ్లనున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని మెహసానాలోని మోధేరా నుంచి నేడు ప్రధాని తన పర్యటనను ప్రారంభించనున్నారు.
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
చాలా మంది ఐఏఎస్ అధికారులు దేశ రాజధానిలో తమ సేవలందించడానికి ఇష్టపడతారు. కానీ ఇటీవలె కాలంలో రాజకీయ నేతల ఒత్తిడి మరియు అధికారులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కారణంగా వారు ఆవైపు కూడా చూడాలనుకోవడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విన్నవిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్టు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు. పాట్నా పర్యటన సమయంలో దాడికి విఫలయత్నం చేశారని, దాడులు చేసేందుకు పలువురికి శిక్షణ ఇచ్చినట్టు నిర్ధారించారు.
పాకిస్ధాన్ ముస్లిం లీగ్ అధినేత నవాజ్ షరీష్ ను విభేధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు కురిపించారు. పాకిస్థానలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మోదీని ఉదహరిస్తూ నవాజ్ ను ఏకిపారేసారు.
మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి.
కేరళలోని తమ లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కుట్రలకు పాల్పడుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు.