BJP manifesto : యూనిఫాం సివిల్ కోడ్ , రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు.. గుజరాత్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ 'సంకల్ప్ పత్ర' లేదా 'మేనిఫెస్టో'ని విడుదల చేసారు.
BJP manifesto: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ‘సంకల్ప్ పత్ర’ లేదా ‘మేనిఫెస్టో’ని విడుదల చేసారు. ఇందులో ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
గుజరాత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ పూర్తిగా అమలు
‘యాంటీ-రాడికలైజేషన్’ సెల్ ఏర్పాటు
గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడం
మూడు సివిల్ మెడిసిటీలు, రెండు ఎయిమ్స్-గ్రేడ్ సంస్థలు ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ సదుపాయాలలో మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ. 10,000 కోట్లతో మహారాజా శ్రీ భగవత్సింహ్‌జీ స్వాస్థ్య కోష్ ఏర్పాటు . ఇవి కాకుండా సాగునీటి సౌకర్యాల కోసం రూ.25 వేల కోట్లు ప్రకటించడంతో రాష్ట్రంలోని రైతు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తానని బీజేపీ హామీ ఇచ్చింది.