Home / Nara Lokesh
Yuvagalam: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ఈ రోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా.. కుప్పంలో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్ పై లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ వారాహిని, తన యువగళాన్ని వారు ఆపలేరని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతాం అని సవాల్ చేశారు. 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
మీ జగన్ మాదిరిగా తల్లిని, చెల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటలేదు అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.4వేల కిలో మీటర్లు మేర చేపట్టనున్న యువగళం పాదయాత్రను ఇవాళ ఉదయం కుప్పం నుంచి లోకేశ్ ప్రారంభించారు.
ఈరోజు పాదయాత్రను ప్రారంభించిన టీడీపీ నేత నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ఎద్దేవా చేశారు.
Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న మధ్యలో అస్వస్థతకు గరుయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ పాదయాత్ర చేపట్టారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు.
Nara Lokesh Birthday: నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు పట్టినరోజు శుభాకాంక్షలు వివిధ పద్ధతుల్లో చెబుతున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఓ అభిమాని నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఫోటో వైరల్ గా మారింది. ఇప్పటి వరకూ సినీ నటీనటులకు, క్రీడాకారులకు ఇలాంటి అభిమానాన్ని చూశాం. కానీ ఇలాంటి అభిమానం రాజకీయ నాయకులకు ఉంటుంది అని నిరూపించాడు ఓ […]
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెదేపా పోలిట్ బ్యూరో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, బీసీ సాధికార సమితి సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.
వీరసింహారెడ్డి సినిమాపై కొందరు నెగిటివిటీ సృష్టించడాన్ని మరియు మరికొందరు వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సినిమాలు అంటే వినోదం, అన్ని హద్దులను చెరిపేయడం అని ఆయన పేర్కొన్నారు.
Lokesh -Tarak: నందమూరి తారకరత్న నారా లోకేష్ ను కలవడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. హైదరాబాద్ లోని లోకేష్ నివాసంలో ఈ భేటి జరిగింది. స్వయంగా లోకేష్ ఇంటికి వెళ్లిన తారకరత్న పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో కుటుంబ విషయాలతో పాటు రాజకీయాలు ఉన్నట్లు సమాచారం. తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఓ సారి తారకరత్న ఎన్నికల ప్రచారం చేసిన విషయం […]