Home / Nara Lokesh
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
వైకాపా పాలనలో ప్రజలు పడుతున్న బాధలు ఓవైపు, మరో వైపు సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 365రోజుల పాదయాత్రకు రంగం సిద్ధమైంది
సీఎం జగన్ ఓ పిల్లి నా కొడుకుగా తెదేపా నేత నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ బయటకొస్తే ఇళ్ల తలుపులు, దుకాణాలు మూసేయిస్తారని మండిపడ్డారు. తాడేపల్లిలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని లోకేష్ ప్రారంభించారు.
వైజాగ్ లో విశాఖ గర్జన పేరుతో తలపెట్టిన వైసీపి రాజకీయ యాత్ర తుస్ మందన్నారు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాశారు. కోట్ల రూపాయల నిధులను ఇతర ఖాతాల్లోకి మళ్లించడంతో సర్పంచులు పాలనను గాలి కొదిలేశారని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల పై అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో నారాయణరెడ్డి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుమల శ్రీవారి పై ప్రమాణం చేయాలన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ తరచుగా చేసే విమర్శల్లో ముఖ్యమైనది ఏమిటంటే మామకు వెన్నుపోటు పొడిచాడు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ వెన్నుపోటు విమర్శల పై గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఏపీ చరిత్రలో నేడు బ్లాక్ డే అని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడాన్ని ఆయన ఖండించారు. హెల్త్ యూనివర్సిటీ కట్టింది ఎన్టీఆర్ అని, వైఎస్ఆర్కు దానితో ఎలాంటి సంబంధం లేదన్నారు.
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం ''ఛలో అసెంబ్లీ'' పేరిట వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు.