Home / Munugode
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
ఓ అభ్యర్ధి గుర్తు మార్చిన మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో కొత్త ఆర్వో ఎంపికపై మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపారు. నేటి సాయంత్రానికి కొత్త ఆర్వో పేరును ఈసీఐ ప్రకటించనుంది.
అన్ని ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను కలుస్తూ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఇకపై మునుగోడు రంగంలోకి సీఎం కేసీఆర్ దిగనున్నారని సమాచారం.
ప్రతిపక్షాల ఆరోపణలు కొట్టి పారేస్తున్న పోలీసులు. ప్రలోభాలకు గురి చేస్తే కేసులు పెడతామంటూ హెచ్చరిక.
మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి గుర్తును రిటర్నింగ్ అధికారి మార్చేశారు. ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. బైపోల్స్ వేల రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో రాత్రికి రాత్రే జేపీ నడ్డాకు సమాధి కట్టడం కలకలం రేపుతుంది.
మునుగోడు ఉప ఎన్నికల విషయంలో చీఫ్ ఎలక్షన్ కమీషన్ విఫలం చెందిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్యాలెట్ పేపరు ముద్రణలో తగిన ప్రమాణాలు పాటించలేదన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలు అధికార పార్టీ తెరాసకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఓవైపు పార్టీ యంత్రాంగం మొత్తం మునుగోడు లో ప్రచారం చేస్తుంటే, మరో వైపు ప్రతిపక్షాలు పదునైన అస్త్రాలను వదులుతూ తెరాస నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.
మునుగోడు బైపోల్ సందర్భంగా రోజురోజుకు రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పైకి పథకాలు వాగ్ధానాలు అంటూనే మరోవైపు ప్రజలకు ఓటుకు నోటు ఆశచూపుతారు. ఈ క్రమంలోనే సోమవారం నాడు బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి.